గంగూలీతో బంధాన్ని తెంచుకోవడానికి కారణం ఇదే: నగ్మా

  • గంగూలీ, నేను ప్రేమించుకున్నాం
  • అతని కెరీర్ కోసం బంధాన్ని తెంచుకున్నాం
  • సరైన వ్యక్తి తారసపడితే పెళ్లి చేసుకుంటా
భారతీయ వివాహ వ్యవస్థను తాను ఎంతో గౌరవిస్తానని సినీ నటి, కాంగ్రెస్ పార్టీ నాయకురాలు నగ్మా తెలిపారు. సరైన వ్యక్తి తారసపడితే కచ్చితంగా పెళ్లి చేసుకుంటానని తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఈ 44 ఏళ్ల భామ వెల్లడించారు. ప్రస్తుతానికైతే తన జీవితంలో ఎవరూ లేరని చెప్పారు.

క్రికెట్ మాజీ కెప్టెన్ గంగూలీతో నగ్మాకు రిలేషన్ షిప్ ఉండేదని, ఇద్దరూ పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారని గతంలో వార్తలు హల్ చల్ చేసిన సంగతి తెలిసిందే. దీనిపై ఆమె స్పందిస్తూ, గంగూలీ, తాను ప్రేమించుకున్న సంగతి నిజమేనని చెప్పారు. గంగూలీ కెరీర్ కోసం రిలేషన్ షిప్ కు ముగింపు పలికామని చెప్పారు. ఒకటి కావాలనుకున్నప్పుడు మరొకటి వదులుకోవాలని అన్నారు.
Go Back to Shorts
ganguly
nagma
relationship

More Telugu News